Payyavula Keshav: అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ

Interesting discussion between Perni Nani and Payyavula Keshav
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలనుకుంటున్నానని పేర్ని నాని అన్నారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. దీన్ని గుర్తు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేశవ్ స్పందిస్తూ... 1994లో వచ్చిన ఫలితాలే 2024లో వస్తాయని చెప్పారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచిందని... టీడీపీ అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. 

Go Back to Shorts
Payyavula Keshav
Telugudesam
Perni Nani
YSRCP

More Telugu News