హైదరాబాద్ లో ‘పుష్ప2’ నైట్ షూటింగ్
- ఘన విజయం సాధించిన పుష్ప తొలి పార్ట్
- బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం
- అదే స్థాయిలో రెండో పార్టును తెరకెక్కిస్తున్న సుకుమార్
హీరో అల్లు అర్జున్ తో పాటు ఇతర నటీనటులంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం విదేశాలకు వెళ్తుందని సమాచారం. తదుపరి షెడ్యూల్ ను సుకుమార్ బ్యాంకాక్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండో పార్టుకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ కాగా, ఫవాద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండో పార్టులో హీరోయిన్ సాయి పల్లవి అతిథి పాత్రలో కనిపించనుంది.