జైల్లో కోడికత్తి శ్రీనును కలిసిన పట్టాభి
- గన్నవరం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పట్టాభి
- జైల్లో కోడికత్తి శ్రీనును కలిశానని వ్యాఖ్య
- మత్తు పదార్థాల కేసుల్లో ఎందరో విద్యార్థులు జైల్లో ఉన్నారని ఆవేదన
విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనును జైల్లో తాను కలిశానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హింసకు శ్రీను ఒక బాధితుడిగా మిగిలిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తనకు తోడుగా లాయర్ ను అనుమతించాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఏపీ సీఐడీ విచారణకు వెళ్లిన వాళ్లంతా లాయర్లు లేకుండానే వెళ్లారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నారా లోకేశ్ కరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గన్నవరం కేసులో గత నెల 22న పట్టాభిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.