యూట్యూబ్‌లో చూసి సొంతంగా కాన్పు చేసుకున్న బాలిక.. ఆపై శిశువును గొంతు నులిమి..!
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
- సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా దగ్గరైన బాలిక
- ఆపై గర్భం దాల్చడంతో ఇంట్లోనే సొంతంగా కాన్పు
- బిడ్డ గొంతు నులిమి పెట్టెలో దాచేసిన బాలిక
ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. పొట్ట పెరుగుతుండడంతో అనుమానించిన బాలిక తల్లి ప్రశ్నించగా ఏం లేదని, అనారోగ్యం వల్లే పొట్ట పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది.
ఆ తర్వాత ఇంట్లోని పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తల్లి బయటకు వచ్చిన తర్వాత కుమార్తె నీరసంగా కనిపించడంతో గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.