మరో కొత్త హీరోయిన్​కు చాన్స్​ ఇస్తున్న నాగార్జున

Nagarjuna to pair up with Miss India Manasa
  • మాజీ మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసికి లక్కీ చాన్స్
  • రచయిత ప్రసన్న కుమార్ దర్శకుడిగా నాగ్ 99వ సినిమా
  • ఇందులో హీరోయిన్ గా మానసకు అవకాశం
చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ముందుంటారు. దర్శకులు, సహ నటీనటులు, టెక్నీషియన్స్ కు ఆయన చేయందిస్తుంటారు. తన కంటే చిన్న, పెద్ద వాళ్లతో పని చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంలో కొత్త హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారని సమాచారం. ఆమె మాజీ మిస్ ఇండియా వరల్డ్, హైదరాబాద్ కు చెందిన మానస వారణాసి. అందాల పోటీలు, మోడలింగ్ లో ఇప్పటికే మంచి పేరు సంపాదించిన మానస కు హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని నాగ్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 

ఇప్పటికే ఇద్దరిపైనా ఫొటో షూట్ కూడా పూర్తయిందని అంటున్నారు. మానస వారణాసి కూడా మంచి గుర్తింపు తెచ్చే క్యారెక్టర్లో యాక్ట్ చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తోందని సమాచారం. ఇప్పుడు నాగార్జున లాంటి పెద్ద హీరోతో తెరంగేట్రం చేసే అవకాశం ఆమెను వరించనుంది. నాగార్జున, మానస కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి కొత్త వ్యక్తి కూడా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ తో నాగ్ సినిమా చేయనున్నాడు. ఇది నాగ్ కి 99వ చిత్రం కానుంది. కథ, స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
Tollywood
Nagarjuna

More Telugu News