Akhil: 'ఏజెంట్' నుంచి 'మళ్లీ మళ్లీ' లిరికల్ సాంగ్!

  • అఖిల్ హీరోగా రూపొందిన 'ఏజెంట్'
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • సంగీతాన్ని అందించిన హిప్ హాప్ తమిళ 
  • ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు
Agent Lyrical Song Released

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా ఇది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే ..' అంటూ ఈ పాట సాగుతోంది. తెలుగు .. ఇంగ్లిష్ మిక్స్ చేసి అల్లిన పదాల అమరికతోనే పాట అంతా కనిపిస్తోంది. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటను హీరో హీరోయిన్లపై ఫారిన్ లో చిత్రీకరించారు. బీట్ ప్రధానంగా సాగే పాట ఇది .. పాఠం అప్పగించినట్టుగా అనిపిస్తుంది. 

ఈ సినిమాతో తెలుగు తెరకి సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ దృశ్యాల కారణంగా .. దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించడం వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. ఈ సినిమాతో అఖిల్ మరో హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

More Telugu News