చంద్రబాబు కారును ఢీకొట్టిన మరో కారు.. తప్పిన ప్రమాదం
- నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ప్రమాదంలో వంగిపోయిన చంద్రబాబు వాహనం బంపర్
- బాబుకు ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న టీడీపీ నేతలు
'ఇదేం కర్మ మన రాష్రానికి' కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో చంద్రబాబు కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు ఆయన సిద్ధమయ్యారు.