Vangalapudi Anitha: అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రోజా: వంగలపూడి అనిత

Vangalapudi Anitha fires on minister Roja
  • నగరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • జబర్దస్త్ ఆంటీ అంటూ వ్యాఖ్యలు
  • లోకేశ్ ను అంకుల్ అంటానని రోజా వెల్లడి
  • చావుదెబ్బలు తింటావంటూ హెచ్చరించిన వంగలపూడి అనిత
యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ పై ఏపీ మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించడం తెలిసిందే. తనను లోకేశ్ జబర్దస్త్ ఆంటీ అని పిలిచినందుకు బదులుగా, లోకేశ్ ను అంకుల్ అని పిలుస్తానని రోజా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మంత్రి రోజాపై నిప్పులు చెరిగారు. 

రోజా నోరు అదుపులో పెట్టుకోకుంటే, ఏదో ఒకరోజు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ల చేతిలో చావుదెబ్బలు తినడం ఖాయం అని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే నేరాలు, ఘోరాలన్నింటికీ ఐరన్ లెగ్ రోజా, మహా ఐరన్ లెగ్ జగనే కారణమని వ్యాఖ్యానించారు.

అనిత ప్రెస్ మీట్ వివరాలు...

• లోకేశ్ పర్యటనతో చిర్రెత్తుకొచ్చి, రోజా రోడ్డునపడి అరుస్తోంది.
• రాజకీయాల్లో ఐరన్ లెగ్ రోజా... ఐరన్ లెగ్గులకే లెగ్గు జగన్. 
• రాష్ట్రాన్ని అవినీతిమయంచేసి దందాలు, కబ్జాలతో నెట్టుకొస్తూ, చెప్పులు మోయించే స్థితికి వచ్చినవాళ్ల గురించి మాట్లాడటానికి మాకే సిగ్గుగా ఉంది. నగరి ప్రజల దౌర్భాగ్యం అక్కడి ఎమ్మెల్యే.

• సినిమాల్లో ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ శాస్త్రి అయితే, రాజకీయాల్లో ఐరన్ లెగ్ రోజా.
• రోజా ఐరన్ లెగ్ అయితే, జగన్ రెడ్డి మహా ఐరన్ లెగ్ గా మారి, పరిపాలన మొత్తాన్ని నేరాలు, ఘోరాల మయంచేశాడు. 
• కచ్చులూరు బోటుప్రమాదంలో 56 మంది చనిపోవడం జగన్ లెగ్ ప్రభావమే. 
• అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి 39 మంది చనిపోయి, రూ.1700 కోట్ల ఆస్తి నష్టం జరగడానికి  ఆ లెగ్గే కారణం.
• జంగారెడ్డిగూడెంలో 28 కల్తీ సారా మరణాలు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 13మంది, ఏలూరులో నీరు తాగి 600 మంది ఆసుపత్రి పాలుకావడం సైకో రెడ్డి లెగ్ మహత్యమే.
• కలియుగ వేంకటేశ్వరస్వామి ఆలయమే మూతపడేలా చేసిన కరోనా మహమ్మారికి కారణం జగన్ రెడ్డి లెగ్ పుణ్యమే. 
• అలాంటి లెగ్ పట్టుకొనే రోజా... ఐరన్ లెగ్ అని లోకేశ్ ను అంటుందా? 

• కొవ్వుపట్టిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రోజా.
• అవినీతి, ఇసుకదందాలు, మట్టిఅమ్మకాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే రోజా కుటుంబసభ్యుల్ని అంటే, ఆమెకు కోపమొస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తూ, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని అంటే మాకు కూడా లాగిపెట్టి రెండు ఇవ్వాలి అనిపిస్తుంది. 

• లోకేశ్ నీలాగా పనివాళ్లతో చెప్పులు మోయించలేదు రోజా!
• లోకేశ్ తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 ఏళ్లు ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తుల పెంపకంలో పెరిగిన లోకేశ్ ఏనాడూ పనివాళ్లను చిన్నచూపు చూసిందిలేదు. 
• అదీ లోకేశ్ సంస్కారమైతే, నీ సంస్కారం కుసంస్కారం రోజా.
• లోకేశ్... జగన్ రెడ్డిని వాడు, వీడు అన్నదే రోజాకు వినిపించిందా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుని ఎన్ని దుర్భాషలాడాడో నీకు తెలియదా రోజా? 
• నటుడు హైపర్ ఆదిని నువ్వు ఏమన్నావో మర్చిపోయావా రోజా?

• పదో తరగతి పరీక్ష పేపర్లు కొట్టేసిన వాడి దగ్గర పనిచేస్తున్న రోజా, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేశ్ ను అంటుందా? 
• నువ్వూ, నీ జగనన్నా లోకేశ్ ను చూసి భయపడకపోతే ఎందుకు ఆయన పాదయాత్ర అడ్డుకుంటున్నారు? 
• ఎందుకు మైక్ లు లాక్కొని, ఆఖరికి నిలబడిన స్టూళ్లను కూడా లాక్కుంటున్నారు. 
• లోకేశ్ ఎక్కడికి వెళ్లినా ఆయన వద్దకు వచ్చే జనమంతా అభిమానంతో, ప్రేమతో వస్తారు 
• తిరుమలస్వామివారి దర్శనాలు కూడా అమ్ముకునే దుస్థితికి దిగజారిన రోజా, తన అవినీతి ఎవరికీ తెలియదులే అనుకుంటోంది.
 
• జగన్ కు నువ్వు గారాలచెల్లివి  కదా రోజా... నీ ఆస్తులపై, లోకేశ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించమని  నీ ముద్దుల అన్నయ్యకు లేఖ రాయి. 
• అలాగే మంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాసి, సీబీఐ విచారణ కోరు రోజా. అంత ధైర్యం నీకుందా...? 
• జగనన్న సర్వేలు చూసి 20 మందిని దారుణంగా తిట్టాడని మీడియాలో వచ్చిందికదా... ఆ జాబితాలో రోజాదే అగ్రస్థానం. 
• వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి సీటు ఇస్తే, ఆమెను ఓడించి తీరుతామని నగరి వైసీపీ నేతలే చెబుతున్నారు. 

• జబర్దస్త్ వల్ల ఏ ప్రామాణికంతో ఆరోగ్యాలు బాగుపడ్డాయో చెప్పమ్మా రోజా...!
•  ద్వంద్వార్థాలు, అసభ్య సంభాషణలు వింటూ, రోజా సిగ్గులేకుండా పక్కనున్న వాళ్లను కొట్టి... పడీపడీ నవ్వుతోంది. 
• జబర్దస్త్ తో  ఆరోగ్యాలు బాగుపడితే, మీ జగనన్నకు చెప్పి రాష్ట్రంలోని ఆసుపత్రులు మూసేయించు రోజా.

Vangalapudi Anitha
Roja
Nara Lokesh
TDP
YSRCP

More Telugu News