నారా లోకేశ్ ని అంకుల్ అని సంబోధించిన రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నారా లోకేశ్ ని అంకుల్ అని సంబోధించిన రోజా

Roja called Nara Lokesh as uncle
  • రోజాను జబర్దస్త్ ఆంటీ అన్న లోకేశ్
  • లోకేశ్ ను ఐరన్ లెగ్ అన్న రోజా
  • పెద్దల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియదని మండిపాటు
యువగళం పాదయాత్రలో నగరి పర్యటనలో మంత్రి రోజాపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాను జబర్దస్త్ ఆంటీ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై రోజా మండిపడ్డారు. లోకేశ్ ను ఐరల్ లెగ్ అని, లోకేశ్ అంకుల్ అని సంబోధించారు. 

ఎవరి కుటుంబానికి ఎంత ఆస్తులు ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పెద్దల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు. ప్రజల ఉన్నతి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. యువగళం పాదయాత్రకు జనాలు రావడం లేదని... దీంతో బెంగళూరు, చెన్నై నుంచి జనాలను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు.
Advertisement
Roja
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News