తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- 15 స్థానాలకు ఈ నెల 16న నోటిఫికేషన్
- వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహించనున్న ఈసీ
- మార్చి 16న ఓట్ల లెక్కింపు
నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి ( ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం), వెన్నపూస గోపాలరెడ్డి ( కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం), మాధవ్ (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం), విఠపు బాలసుబ్రహ్మణ్యం ( ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గం), కత్తి నరసింహారెడ్డి ( కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గం) ల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో కాతేపల్లి జనార్దన్ రెడ్డి (మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగియనుంది.