అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం
- ఈ నెల 17న అమెరికా వెళ్లిన రవికుమార్
- మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరిక
- కంటెయినర్ పైనుంచి జారిపడి మృతి
- సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లిలో విషాదం
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కంటెయినర్ పైనుంచి జారిపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలియజేశారు. రవికుమార్‌కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.