మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య

మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య

Sucharitha escort driver suicide
  • గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత నివాసం సమీపంలో ఆత్మహత్య
  • సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
  • ఘటనాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Mekathoti Sucharitha
YSRCP
Escort Driver
Suicide

More Telugu News