విజయ్ నాకు మంచి ఫ్రెండ్.. టూర్ కు వెళ్తే తప్పేముంది?: రష్మిక మందన్న
- ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతూనే ఉంటానన్న రష్మిక
- హాస్టల్ లో ఉన్నప్పుడు చేయని తప్పులకు మాటలు పడేదానినని వ్యాఖ్య
- మనసులో బాధ ఉన్నా నవ్వుతూనే ఉంటానన్న రష్మిక
తనతో పాటు హాస్టల్ లో 800 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ తనతో ఎవరూ సరిగ్గా ఉండేవారు కాదని చెప్పింది. తాను చేయని తప్పులకు కూడా మాటలు పడేదానినని... ప్రతిరోజూ గదిలో కూర్చొని ఏడ్చేదానినని తెలిపింది. అయితే తన సమస్యలన్నింటినీ అమ్మతో పంచుకోవడం తనకు అలవాటని... అదే తనను స్ట్రాంగ్ గా మార్చిందని చెప్పింది. తనకు ఇది అలవాటయిపోయిందని... అందుకే తాను ఇంత స్ట్రాంగ్ గా ఉంటానని తెలిపింది. ఇలాంటి అనుభవాలను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. విజయ్ దేవరకొండ తనకు మంచి ఫ్రెండ్ అని.. స్నేహితులన్నాక టూర్స్ కు వెళ్లడం సహజమని తెలిపింది.