Prabhas: ఈ ఏడాదిలోనే ప్రభాస్ .. మారుతి మూవీ రిలీజ్!

  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్
  • హారర్ కామెడీ జోనర్లో 'రాజా డీలక్స్'
  • ఈ నెల 27వ తేదీ నుంచి మూడో షెడ్యూల్
  • ఈ దసరాకి విడుదల చేయాలనే ఆలోచన
Raja Deluxe Movie Update

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'సలార్' .. 'ప్రాజెక్టు K' .. 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన ఒకదాని తరువాత ఒకటిగా పూర్తిచేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మారుతి దర్శకత్వంలో చేయనున్న 'రాజా డీలక్స్' సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.  

అయితే ఈ సినిమా షూటింగు ఆల్రెడీ మొదలైపోయిందని తెలుస్తోంది. ప్రభాస్ పాల్గొనగా ఒక షెడ్యూల్ ను .. ప్రభాస్ లేకుండగా మరో షెడ్యూల్ షూటింగును జరిపినట్టుగా సమాచారం. ఈ రెండు షెడ్యూల్స్ కి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక మూడో షెడ్యూల్ షూటింగును ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారని అంటున్నారు.

మూడో షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొననుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారట. మరో  కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాను, ఈ ఏడాది దసరా పండుగకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News