సంక్రాంతి వేడుకలో పొంగలి వండి వడ్డించిన గవర్నర్ తమిళిసై
- రాజ్ భవన్ లో సందడిగా సంక్రాంతి వేడుకలు
- సిబ్బంది, అధికారులతో కలిసి పాల్గొన్న గవర్నర్
- అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన తమిళిసై
ఇక, మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన ఇద్దరు మహిళలు మృతి చెందడం బాధాకరం అని గవర్నర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నా... పండగ కారణంగా వెళ్లలేకపోయానని చెప్పారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగు పడాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.