ఏపీలో ఇక ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!
- ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన స్మార్ట్ కార్డుల జారీ
- పెండింగులో వేలాది డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీలు
- క్యూఆర్ కోడ్‌తో పీవీసీ కార్డులు తీసుకొచ్చే యోచన
- త్వరలోనే టెండర్లు పిలవనున్న అధికారులు
ఈ నేపథ్యంలో ఇప్పుడు స్మార్ట్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో పీవీసీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్టణంలో ప్రయోగాత్మకంగా వీటిని సరఫరా చేశారు. తెలంగాణలో ఇప్పటికే చిప్ లేని కార్డులను జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ అటువంటివే జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటిపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ద్వారా నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్డుల జారీకి సంబంధించి టెండర్లు పిలిచే అవకాశం ఉంది.