మైలవరంలో వేడెక్కిన రాజకీయం.. బాలయ్య, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు
Add ap7am to your home Screen

మైలవరంలో వేడెక్కిన రాజకీయం.. బాలయ్య, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు

Balakrishna and MLA Vasantha Krishna Prasad Flexi In Velagaleru
  • వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం
  • వెలగలేరులో బాలయ్య, కృష్ణ ప్రసాద్ ల భారీ ఫ్లెక్సీ
  • తాను బాలయ్య అభిమానిని కావడంతోనే ఏర్పాటు చేశానన్న వైసీపీ గ్రామ నేత
  • ఎమ్మెల్యేకు, దీనికి సంబంధం లేదని వివరణ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారబోతున్నారంటూ ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్న భారీ ఫ్లెక్సీ ఒకటి కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా జి.కొండూరు మండలం వెలగలేరులో వీరి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయం కాస్తా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో చర్చ మొదలైంది. ఈ ఫ్లెక్సీని చూసినవారు వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారడం పక్కా అని ఓ నిర్ణయానికి వచ్చేశారు. 

గ్రామానికి చెందిన వైసీపీ నేత చల్లగుళ్ల అజయ్ కుమార్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. తాను బాలయ్య అభిమానిని కావడంతో ఎమ్మెల్యే ఫొటోతో కలిపి ఫ్లెక్సీని ఏర్పాటు చేశానని, అంతేకానీ, ఎమ్మెల్యేకు.. ఈ ఫ్లెక్సీకి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన వివరణ ఇచ్చారు.
Advertisement
Balakrishna
Vasantha Krishnaprasad
Mylavaram
YSRCP
Veerasimha Reddy
NTR Dist

More Telugu News