Balakrishna: జీవితంలో ఇంతకంటే ఏం కావాలి?: 'వీరసింహారెడ్డి' ఈవెంటులో గోపీచంద్ మలినేని

Veera Simha Reddy Movie Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన 'వీరసింహా రెడ్డి' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఒంగోలు'లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆయన మాట్లాడుతూ .. "ఒకప్పుడు బాలయ్య బాబు అభిమానిగా 'సమరసింహా రెడ్డి' సినిమాకి వెళ్లిన నేను, ఈ రోజున ఆయన సినిమాను డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాను .. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?" అన్నాడు.

"బాలయ్య బాబు సెట్ కి వస్తే ఆయనను నేను ఒక అభిమానిగా .. ఒక దర్శకుడిగా దగ్గర నుంచి గమనించాను. అభిమానులకు ఆయన నుంచి ఏం కావాలో అది రాబట్టుకున్నాను. ఆయనకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ ఆయనతో సినిమా చేసే ఛాన్స్ నాకు మాత్రమే దక్కింది. నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టం" అని చెప్పాడు. 

"ఇక శ్రుతి హాసన్ తో నేను చేసిన మూడో సినిమా ఇది .. ఆమె నా లక్కీ హీరోయిన్. తన యాక్టింగ్ .. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. హానీ రోజ్ కూడా డాన్స్ చాలా బాగా చేసింది. భానుమతిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటన .. దునియా విజయ్ విలనిజం ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ ముగించాడు.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Duniya Vijay
Veerasimha Reddy Movie

More Telugu News