కుప్పంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు.. రోడ్ షోకు పయనం

Chandrababu inaugurates private hospital in Kuppam
  • గుడిపల్లి రోడ్ షోకు బయల్దేరిన చంద్రబాబు
  • రోడ్ షోకు అనుమతి లేదంటున్న పోలీసులు
  • అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహిస్తామంటున్న టీడీపీ శ్రేణులు
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన నేటితో ముగుస్తోంది. తొలి రెండు రోజులు ఆయన పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్యే కొనసాగింది. మరోవైపు ఈరోజు కుప్పంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. అనంతరం గుడిపల్లి రోడ్ షోకు ఆయన బయల్దేరారు. 

పెద్ద గొల్లపల్లి క్రాస్, చిన్న గొల్లపల్లి క్రాస్, మాలవాని కొత్తూరు, సంగనపల్లి మీదుగా రోడ్ షో కొనసాగనుంది. గుడిపల్లి రైల్వే స్టేషన్ క్రాస్ లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అయితే రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అనుమతులు లేకున్నా రోడ్ షో నిర్వహించి తీరుతామని చంద్రబాబు, టీడీపీ నేతలు చెపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Kuppam
Road Show

More Telugu News