కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తా: మంత్రి పెద్దిరెడ్డి సవాల్
- చదువుకునే రోజుల నుంచి చంద్రబాబుపై తనదే పైచేయి అన్న పెద్దిరెడ్డి
- పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని వ్యాఖ్య
- తనపై చౌకబారు విమర్శలను ఆపాలన్న పెద్దిరెడ్డి
కాలేజీలో చదువుకునే రోజుల నుంచి కూడా చంద్రబాబుపై తనదే పైచేయి అని పెద్దిరెడ్డి అన్నారు. పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఈసారి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మైనింగ్ లో కమిషన్లు తీసుకుంటున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు విమర్శలను ఆపాలని చెప్పారు.