Prabhas: ఆ సినిమా కోసం నా లుక్ మార్చింది ప్రభాస్: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై గోపీచంద్

  • 'అన్ స్టాపబుల్ 2' షోలో ప్రభాస్ - గోపీచంద్ 
  • గోపీచంద్ న్యూ మూవీకి టైటిల్ సెట్ చేసిన బాలయ్య
  • ఆ టైటిల్ పెడితే 100 డేస్ ఫంక్షన్ కి వస్తానని హామీ 
  •  ప్రభాస్ వల్లనే తాను 'జిల్' సినిమా చేశానని చెప్పిన గోపీచంద్
Unstoppable 2 Update

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ - గోపీచంద్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాలయ్యతో కలిసి ప్రభాస్ - గోపీచంద్ ఇద్దరూ కూడా ఒక రేంజ్ లో సందడి చేశారు. 

ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు రెండూ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. గోపీచంద్ ప్రతి సినిమా టైటిల్ చివర్లో సున్నా వస్తుంటుంది. అందువలన ఈ సినిమాకి 'రామబాణం' అనే టైటిల్ పెట్టుకోమని బాలకృష్ణ అన్నారు. 100 డేస్ ఫంక్షన్ కి తాను వస్తానని మాట ఇచ్చారు. 

ఇక ఆ తరువాత ప్రభాస్ హోమ్ బ్యానర్లో 'జిల్' సినిమా ఎలా సెట్ అయిందని గోపీచంద్ ను అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ .. " రాధాకృష్ణ కుమార్ 'జిల్' కథతో వచ్చినప్పుడు ప్రభాస్ విన్నాడు. కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా చేసేయ్' అన్నాడు. "ఈ సినిమాలో రెగ్యులర్ లుక్ తో కనిపించవద్దురా .. హెయిర్ స్టైల్ మార్చాలి" అంటూ దగ్గరుండి నా గెటప్ మార్చింది ప్రభాస్ అని చెప్పాడు. నిజంగానే ఆ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందని బాలయ్య మెచ్చుకున్నారు.

More Telugu News