లావుగా ఉన్నావు గేమ్స్ ఆడొచ్చు కదా అన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి... అమ్మ ఫోన్ ఇవ్వడంలేదన్న బాలుడు
- గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహించిన కేతిరెడ్డి
- బాలుడు చెప్పిన సమాధానంతో అవాక్కయిన వైనం
- సెల్ ఫోన్ గేమ్స్ కాదు గ్రౌండ్ కు వెళ్లి గేమ్స్ ఆడాలని సలహా
ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావమ్మా?
బాలుడు: 8వ తరగతి చదువుతున్నాను.
ఎమ్మెల్యే: ఏందిరా... అంతా లావుగా అయిపోయావు!.. గేమ్స్ ఆడుకోవా?
బాలుడు: ఆడుకోను.
ఎమ్మెల్యే: గేమ్స్ ఆడుకోవా... ఎందుకని... ఏం?
బాలుడు: అమ్మ సెల్ (ఫోన్) ఇవ్వదు.
ఎమ్మెల్యే: అమ్మ సెల్ ఇవ్వదా?... సెల్ ఫోన్ లో కాదురా గేమ్ ఆడమనేది... గ్రౌండ్ కు వెళ్లి గేమ్ ఆడాలి.
బాలుడు: ఆడతాను సర్.
ఎమ్మెల్యే: ఏం గేమ్ ఆడతావు?
బాలుడు: కబడ్డీ ఆడతాను సర్.
ఎమ్మెల్యే: కబడ్డీ ఆడి అందరినీ ఎత్తిపడేయడానికా...? వేరే గేములు ఆడు... గ్రౌండ్ లో నాలుగు రౌండ్లు పరిగెత్తు.
... అంటూ సలహా ఇచ్చిన ఎమ్మెల్యే అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.