'అన్ స్టాపబుల్ 2'లో ఏ ఎపిసోడ్ ఎప్పుడు చూడొచ్చంటే ..!

Unstoppable 2 Update
  • 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై సందడి చేసిన ప్రభాస్
  •  ఈ నెల 6వ తేదీ నుంచి సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ 
  • ఈ నెల 13న 'వీరసింహారెడ్డి' స్పెషల్ ఎపిసోడ్
  • ఆ తరువాతనే లైన్లోకి పవన్ ఎపిసోడ్ 
'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో జోరుగా జరుగుతోంది. సురేశ్ బాబు .. అల్లు అరవింద్ ..  రాఘవేంద్రరావు .. కోదండ రామిరెడ్డి పాల్గొన్న ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తరువాత జయసుధ .. జయప్రద .. రాశి ఖన్నాతో చేసిన ఎపిసోడ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక క్రితం వారం వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ఎక్కువమందికి రీచ్ అయింది. ఈ ఎపిసోడ్ ను అందరూ ఎంజాయ్ చేశారు. ప్రభాస్ కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ను బాలయ్య ఏయే ప్రశ్నలు అడగనున్నాడా అనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు. 

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన 'వీరసింహారెడ్డి' టీమ్ సభ్యులు ఈ టాక్ షోలో పాల్గొననున్నారు. జనవరి 12వ తేదీనే ఈ సినిమా రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఆ తరువాతనే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలతో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు.
Advertisement
Balakrishna
Prabhas
Pavan Kalyan
Unstoppable

More Telugu News