Prabhas: ప్రభాస్ తో బాలకృష్ణ 'అన్ స్టాపబుల్-2' తొలి ఎపిసోడ్ సీజన్ రికార్డు

  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2 టాక్ షో
  • ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య
  • రెండు వారాలుగా ఇంటర్వ్యూ
  • గురువారం నుంచి తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్
  • 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్
Prabhas episode in Unstoppable 2 talk show set season record

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ హాజరైన అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ కు ఆహా ఓటీటీలో రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సాంకేతిక సమస్యతో స్ట్రీమింగ్ ఆగిపోయినా, ఆ తర్వాత పునరుద్ధరించారు. ఈ ఎపిసోడ్ 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ఈ ఎపిసోడ్ రికార్డు సృష్టించింది. 

ప్రభాస్ తో బాలకృష్ణ ఇంటర్వ్యూని రెండు భాగాలుగా రూపొందించారు. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది మొదటి భాగమే. రెండో పార్టులో ప్రభాస్ కు గోపీచంద్ కూడా జతకలవనున్నారు. దాంతో ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏపిసోడ్ వచ్చే వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News