'వీరసింహారెడ్డి' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ .. చూసేయండి!
- 'వీరసింహా రెడ్డి'గా పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ
- ఆయన జోడీకట్టిన శ్రుతి హాసన్
- రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన తమన్ సంగీతం
- జనవరి 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం మేకింగ్ వీడియోను వదిలారు. బాలయ్య యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్ చిత్రీకరణకి సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలోని బిట్స్ తో మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగు చూడటానికి వచ్చిన బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నారు.
బాలకృష్ణ ఇంతకుముందు చేసిన ఫ్యాక్షన్ సినిమాలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.