Andhra Pradesh: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

  • ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు
  • ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం
  • కేవలం 6 పేపర్లకే పరీక్షలు  
AP 10th exams schedule

ఏపీలో పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. కేవలం 6 పేపర్లకు మాత్రమే పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ లో పేర్కొంది. 

10వ తరగతి పరీక్షల షెడ్యూల్: 

  • ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 6 - సెకండ్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 8 - ఇంగ్లీష్
  • ఏప్రిల్ 10 - మ్యాథ్స్
  • ఏప్రిల్ 13 - సైన్స్
  • ఏప్రిల్ 15 - సోషల్
  • ఏప్రిల్ 17 - కాంపోజిట్ కోర్సు
  • ఏప్రిల్ 18 - ఒకేషనల్ కోర్సు

More Telugu News