Advertisement

ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను: టీడీపీ కార్యకర్తల మృతిపై పవన్ తీవ్ర విచారం

Pawan Kalyan says he pained with deaths of TDP workers
  • చంద్రబాబు సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి
  • చాలా దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు రోడ్ షోలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం, మరికొందరు ఆసుపత్రిపాలు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని... అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఆసుపత్రిపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
Advertisement
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Kandukuru

More Telugu News