చిన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చేస్తాం: రైల్వే శాఖ
- కొత్త పథకం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
- మౌలిక వసతుల కోసం రూ.20 కోట్ల దాకా వెచ్చించనున్న రైల్వే శాఖ
- ఇప్పటికే 200 ప్రధాన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు
రైల్వేలోని 68 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న 200 ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు అదనంగా చిన్న స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. స్టేషన్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, దశలవారీగా సౌకర్యాలను మెరుగుపరచడం, హై లెవల్ ప్లాట్ ఫారమ్ ల ఏర్పాటు, వెయిటింగ్ రూమ్ ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. స్టేషన్ బయట ప్రణాళికబద్ధమైన పార్కింగ్, లైటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడం, రైళ్ల రాకపోకలను తెలిపే డిజిటల్ బోర్డులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లను ఈ పథకం కింద చేపట్టనుంది.