rashi Khanna: విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది: రాశి ఖన్నా

  • బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రాశీ ఖన్నా
  • జయప్రద, జయసుధలతో పాటు పాల్గొన్న రాశి
  • ప్రోమోను విడుదల చేసిన ఆహా సంస్థ
I have crush on Vijay Devarakonda says Rashi Khanna

అన్ స్టాపబుల్ షోతో బాలకృష్ణ దూసుకుపోతున్నారు. పూర్తిగా ఎంటర్టైన్ మెంట్ తో కొనసాగుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో సీజన్ 2 కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించిన బాలయ్య... వారి నుంచి ఆసక్తికర విషయాలను రాబట్టారు. తాజాగా అలనాటి అందాల తారలైన జయప్రద, జయసుధలతో పాటు యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నాలతో అన్ స్టాపబుల్ షోను బాలయ్య నిర్వహించారు. 

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య రాబట్టారు. టాలీవుడ్ హీరోల్లో నీకు ఎవరిపై క్రష్ ఉందని బాలయ్య అడగ్గా... ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని రాశి సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

More Telugu News