మహారాష్ట్రలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం!
- పాల్ఘర్ జిల్లాలో ఘటన
- బాలికకు మాయమాటలు చెప్పి పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లిన బాలుడు
- అక్కడ మరో ఏడుగురితో కలిసి అత్యాచారం
- రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అఘాయిత్యం
రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.