Balakrishna: 'బాహుబలి'తో బాలయ్య షో ఫస్ట్​ గ్లింప్స్ అదుర్స్.. వీడియో ఇదిగో!

  • అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్
  • గోపీచంద్ తో కలిసి వచ్చిన రెబల్ స్టార్
  • ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు
First glimps of Balakrishna show with Prabhas

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షోను బాలకృష్ణ తనదైన శైలిలో నడిపిస్తున్నారు. గెస్టులతో ఆయన సరదా సంభాషణ అలరించేలానే కాకుండా ఆసక్తికరంగా ఉంటోంది. ఈ షోలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సందడి చేయనున్నారు. బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇలాంటి తరహా షో లో పాల్గొనడం తెలుగులో ఇదే మొదటి సారి. అలాగే, బాలకృష్ణతో ఆయన తొలిసారి వేదిక పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ కోసం అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. 

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీకరణ ఈ మధ్యే పూర్తయింది. తన స్నేహితుడు, హీరో గోపీచంద్ తో కలిసి ప్రభాస్ ఈ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి 43 సెకన్ల నిడివి గల చిన్న గ్లింప్స్ ను ఆహా విడుదల చేసింది. బాలయ్యను కలిసిన బాహుబలి అంటూ మొదలైన ఈ గ్లింప్స్ లో ప్రభాస్ ను బాలకృష్ణ ఆప్యాయంగా హత్తుకున్నారు. నవ్వుతూ హుషారుగా కనిపించిన ప్రభాస్ ను బాలకృష్ణ ఆటపట్టిస్తూ  కనిపించారు. త్వరలో మొయిన్ ప్రోమో విడుదల కానుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

More Telugu News