SJ Surya: అమెజాన్ ప్రైమ్ లో 'వధంది' .. ఉత్కంఠను రేపుతున్న ట్రైలర్!

Vadhanthi Trailer Released
షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైన వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందే వెబ్ సిరీస్ లను యూత్ ఎక్కువగా ఇష్టపడుతోంది. అందువలన ఆ తరహా కథలు ఎక్కువగా రంగంలోకి దిగుతున్నాయి. అలా అమెజాన్ ప్రైమ్ ద్వారా మరో వెబ్ సిరీస్ గా 'వధంది' పలకరించనుంది. వాల్ వాచర్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు.  

ఎస్.జె. సూర్య - లైలా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక ఫారెస్టు ప్రాంతంలో ఒక యువతి హత్య జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆ కేసు విచారణను ఎస్. జె. సూర్య చేపడతాడు. 

ఆ యువతి తెలిసినవారితో ఆ ప్రాంతానికి వచ్చిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వచ్చి చంపారా? అనే సందేహం ఆ పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. దాంతో ఆయన ఆ యువతితో పరిచయం ఉన్నవారందరిని పిలిపించి ఆరాతీయడం మొదలుపెడతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. 'విక్రమ్ వేద' డైరెక్టర్స్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడం వలన సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది.
Go Back to Shorts
SJ Surya
laila
Sanjana
Vadhanthi Web Series

More Telugu News