కృష్ణ మృతికి సంతాపంగా రేపు విజయవాడలో సినిమా షోల బంద్
- విజయవాడతో కృష్ణకు మంచి అనుబంధమన్న ఫిలిం ఛాంబర్
- నగర వ్యాప్తంగా రేపు సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
- సినీ అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి
ఇదిలా ఉంటే...కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.