తన ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- భుజం గాయం నుంచి కోలుకున్నట్టు తెలిపిన యువ హీరో
- ఎనిమిది నెలల నుంచి నొప్పితో ఇబ్బంది పడిన విజయ్
- పూర్తిగా కోలుకొని ‘బీస్ట్’ బయటికి వస్తోందని ఇన్ స్టా లో పోస్ట్
చికిత్స తర్వాత ఎట్టకేలకు ఈ సమస్య నుంచి పూర్తిగా బయట పడ్డట్టు విజయ్ చెప్పాడు. ఈ మేరకు చేతులు చూపిస్తూ ఓ ఫొటోను షేర్ చేశాడు. 8 నెలల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని అందులో రాశాడు. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు.
ఇదిలావుంచితే, విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో కొంత భాగం షూటింగ్ చేశారు. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేశారు.