పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు: నారా లోకేశ్
- గ్రౌండ్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తున్నారన్న లోకేశ్
- పేద క్రీడాకారులు ఫీజుల చెల్లించలేక క్రీడలకు దూరమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్య
- రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉందని విమర్శ
నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకు ఎలాంటి సాయం అందించకుండా వేధించారని.. ఇప్పుడు ఏకంగా పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. శాప్ లో అర్హత, క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకుని అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరాలు పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.