రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతున్నాం: ట్విట్టర్ సీఈవో మస్క్
- మరోమార్గం లేక ఉద్యోగాల్లో కోత విధింపు
- ఉద్యోగం కోల్పోయిన వాళ్లను ఆదుకుంటామని వెల్లడి
- మూడు నెలల పాటు సగం కన్నా ఎక్కువే జీతం చెల్లిస్తామన్న మస్క్
తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని మస్క్ చెప్పారు. మూడు నెలల పాటు వారికి 50 శాతం కంటే ఎక్కువే జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన వారంలోపే ఉద్యోగాలలో కోత మొదలు పెట్టారు. పొదుపు చర్యల్లో భాగంగా ట్విట్టర్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి సాధారణ ఉద్యోగుల దాకా చాలామందిని ఇంటికి పంపించారు.