రాహుల్ గాంధీ ప్రసంగం ముగియగానే.. వేదికపైనే స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ
- తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర
- గురువారం ఆందోల్ లో సభ నిర్వహించిన కాంగ్రెస్ నేత
- రాహుల్ ప్రసంగానికి జనం నుంచి ఊహించని స్పందన
- జనం స్పందన చూసి మైమరచి స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ
ఈ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగం ముగిసినంతనే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేయడం మొదలెట్టారు. దామోదర స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు.