షాదాబ్, ఇఫ్తికార్ మెరుపుదాడి... దక్షిణాఫ్రికాపై పాక్ భారీ స్కోరు
- సిడ్నీలో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన వైనం
- ఆదుకున్న మిడిలార్డర్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు
ఇఫ్తికార్ అహ్మద్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు చేయగా, చిచ్చరపిడుగులా చెలరేగిన షాదాబ్ 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి సఫారీ బౌలింగ్ ను చీల్చిచెండాడు. మహ్మద్ నవాజ్ 28, మహ్మద్ హరీస్ 28 పరుగులు చేశారు. మహ్మద్ రిజ్వాన్ (4), కెప్టెన్ బాబర్ అజామ్ (6), షాన్ మసూద్ (2) నిరాశపరిచారు.
కాగా, చివరి ఓవర్లలో పాక్ వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. అటు, పాక్ ఇచ్చిన పలు క్యాచ్ లను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నేలపాలు చేశారు. సఫారీ బౌలర్లలో ఆన్రిచ్ నోక్యా 4, పార్నెల్ 1, రబాడా 1, ఎంగిడి 1, షంసీ 1 వికెట్ తీశారు.