భర్తతో ఆ అలవాటు మాన్పించేందుకు రిస్క్ చేసిన శ్రీదేవి
- పొగతాగడం మానే వరకు మాంసం ముట్టనంటూ ప్రతిన
- కేవలం శాకాహారానికే పరిమితమైన శ్రీదేవి
- చాలా బలహీనంగా మారినా వీడని పట్టుదల
- వెల్లడించిన జాన్వీ కపూర్
బోనీ కపూర్ పొగతాగడాన్ని విడిచి పెట్టే వరకు తాను మాంసాహారం ముట్టనంటూ శ్రీదేవి కేవలం శాకాహారానికి పరిమితమైంది. కానీ, చాలా బలహీనంగా ఉన్నావంటూ, మరింత తినాలని, మాంసాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో శ్రీదేవిని బోనీ కపూర్ వేడుకున్నారట. ‘‘నేను పొగతాడాన్ని ఆపేయాలని ఆమె కోరుకుంది. అప్పుడు నేను చేయలేదు. ఇప్పుడు చేస్తాను’’అని నాలుగైదేళ్ల క్రితం తండ్రి తనతో చెప్పినట్టు జాన్వీ వెల్లడించింది.