Shoaib Akhtar: నోబాల్ పై షోయబ్ అఖ్తర్ విమర్శలు

Shoaib Akhtar comments on No Ball
షార్ట్స్‌లో చూడండి
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన హైఓల్డేజ్ టీ20 మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో ఇండియాకే చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే చివరి ఓవర్లో డ్రామా చోటుచేసుకుంది. మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బంతిని కోహ్లీ సిక్సర్ గా మలిచాడు. అయితే ఈ బంతిని నడుము కంటే ఎత్తుగా వచ్చిన నేపథ్యంలో నోబాల్ గా ప్రకటించాలని అంపైర్లను కోహ్లీ కోరాడు. ఈ క్రమంలో ఆ బంతిని అంపైర్లు నోబాల్ గా ప్రకటించారు. ఇండియాకు ఫ్రీ హిట్ వచ్చింది. ఈ నోబాల్ మ్యాచ్ ను మలుపు తిప్పిందనే అనుకోవచ్చు. 

మరోవైపు, ఈ నోబాల్ పై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందిస్తూ... అంపైర్ భయ్యో... మీ ఆలోచనలకు నమస్కారం.. ఈ రాత్రికి మీకు భోజనం పక్కా అని ట్వీట్ చేశారు. మరోవైపు అంపైర్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
Shoaib Akhtar
Pakistan
India
T20
No Ball

More Telugu News