డెంగీ నుంచి కోలుకుంటున్న సల్మాన్ ఖాన్

Salman Khan recovers from Dengue
  • ఇటీవల అనారోగ్యం బారినపడిన సల్మాన్
  • వైద్య పరీక్షల్లో డెంగీగా నిర్ధారణ
  • ఇంటివద్దనే చికిత్స పొందుతున్న స్టార్ హీరో
  • ఈ నెల 25 నుంచి మళ్లీ షూటింగ్ లకు హాజరు!
బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ గత కొన్నిరోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన షూటింగ్ లకు విరామం ఇచ్చారు. ఇంటివద్దనే చికిత్స పొందుతున్న సల్మాన్ క్రమంగా కోలుకుంటున్నారు. 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు. 

ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించగా, సల్మాన్ కు డెంగీ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. దాంతో ఈ చిత్రంపై సల్మాన్ దృష్టి సారించారు. అటు, అనారోగ్యం కారణంగా సల్మాన్ ఖాన్ ఈసారి దీపావళి పార్టీలకు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Salman Khan
Dengue
Recovery
Bollywood

More Telugu News