Dog: దెయ్యం అనుకునేరు.. గుమ్మడికాయ మీద కుక్కపిల్ల.. ముద్దుగా ఉందంటున్న నెటిజన్లు

  • ఓ తెల్లని వస్త్రానికి రంధ్రాలు చేసి కుక్కపిల్ల మొహంపై అమర్చిన తీరు
  • ఆరుబయట గుమ్మడి కాయ మీద కూర్చోబెట్టడంతో.. గాలికి కదులుతూ ఉన్న వస్త్రం
  • ‘వామ్మో కుక్క పిల్ల భయపెడుతోందిగా..’ అంటూ సరదా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
Dog dressed as a ghost

ఓ విశాలమైన మైదానం. కాస్త దూరం దూరంగా పెద్ద పెద్ద గుమ్మడికాయలు పెట్టి ఉన్నాయి. వాటిలో ఓ గుమ్మడికాయ మీద తెల్లటి ఆకారం. అటూ ఇటూ కదులుతూ ఉంది. చూస్తే.. దాని మొహం కుక్కపిల్లలా ఉంది. ఉండటం కాదు.. అది కుక్కపిల్లనే.. దానికి తెల్లని వస్త్రాన్ని డ్రెస్ లా తొడిగి గుమ్మడికాయపై కూర్చోబెట్టారు. అమెరికాలోని ఓ ప్రాంతంలో హాలోవీన్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చేసిన ఏర్పాటు ఇది.

కదలకుండా ముద్దుగా కూర్చుని..
గుమ్మడికాయపై కూర్చున్న కుక్కపిల్ల కదలకుండా కూర్చున్న తీరు ఆకట్టుకుంటోంది. దాని మూతి తెల్లటి వస్త్రం నుంచి బయటికి కనిపిస్తూ భలే ముద్దుగా కనిపిస్తోంది. బ్యూటెంగె బీడెన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘హాలోవీన్ సీజన్ కోసం..’ అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా 20 లక్షలకుపైగా వ్యూస్, 87 వేలకుపైగా లైకులు వచ్చాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. ‘‘భలే ముద్దుగా ఉంది. సో క్యూట్’ అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.

  • ఈ వీడియోలోని ‘‘కుక్కపిల్ల చాలా ముద్దుగా ఉంది.. గుమ్మడికాయపై భలేగా కూర్చుంది.”, ‘‘వామ్మో ఈ కుక్కపిల్ల భయపెడుతోందిగా..”, ‘‘కుక్కపిల్లకు పర్ఫెక్ట్ తెలుపు డ్రస్ వేశారు. బాగా కూర్చోబెట్టారు..” అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.
  • ‘‘ది సీజన్ ఆఫ్ విచ్, డోనోవాన్ –2..” అంటూ హర్రర్ మూవీస్ లకు సీక్వెల్ అన్నట్టుగా కొందరు సరదా కామెంట్లు పెడుతుంటే.. ‘‘ఇంకా నయం.. రాత్రిపూట గానీ అలా కూర్చుని కదులుతూ కనిపిస్తే గుండె ఆగిపోతుంది..” అని మరికొందరు అంటున్నారు.
  • ‘‘అసలు ఆ కుక్కపిల్ల అలా పద్ధతిగా ఎలా కూర్చోబెట్టగలిగారు? చుట్టూ ఉన్న ప్రాంతం, గుమ్మడి కాయలు.. అన్నీ కలిసి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించాయి.” అని కొందరు పేర్కొంటున్నారు.
  • ఇక హాలోవీన్ కోసం సిద్ధం చేసిన మరో రెండు శునకాల జంట వీడియో కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ రెండింటిని డ్రెస్సులు వేసి, క్లిప్పులు పెట్టి అందంగా ముస్తాబు చేశారు కూడా.

More Telugu News