Pawan Kalyan: నోవోటెల్ బయట పవన్ కోసం వేచి ఉన్న జనసైనికులు, అభిమానులు... పోలీసుల లాఠీచార్జి

Police lathi charge on Janasainiks
షార్ట్స్‌లో చూడండి
జనసేనాని పవన్ కల్యాణ్ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో విశాఖలోని నోవోటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు. నేడు విశాఖలోని పోర్టు కళావాహిని స్టేడియంలో జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణి రద్దయింది. దాంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఈ సాయంత్రం నోవోటెల్ హోటల్ వద్దకు భారీగా తరలివచ్చారు. "అరటి పండు తొక్క జగన్ అన్న బొక్క" అంటూ నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో, జనసైనికులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ మేరకు ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Visakhapatnam
Janasena
Police

More Telugu News