విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... ఘనస్వాగతం పలికిన జనసైనికులు
- విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్
- ఎయిర్ పోర్టు వద్దకు పోటెత్తిన అభిమానులు
- ఉత్సాహంగా అభివాదం చేసిన పవన్ కల్యాణ్
- కాసేపట్లో ర్యాలీ
అభిమానుల సంతోషాన్ని చూసి పవన్ కల్యాణ్ కూడా ఉత్సాహంతో వారికి అభివాదం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు వెలుపల జనసేన కళాకారులు వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. కాగా, మరికాసేపట్లో జనసేన ర్యాలీ ప్రారంభం కానుంది.