Telangana: కారు గుర్తును పోలిన 8 గుర్తుల‌ను తొల‌గించండి... తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి టీఆర్ఎస్ విన‌తి

trs requests ts ceo to delete the 8 symbols which are appears like car in free symbols list
షార్ట్స్‌లో చూడండి
మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ సోమ‌వారం తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను క‌లిసింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన గుర్తులు 8 ఉన్నాయ‌ని, వాటిని ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని కోరింది. ఈ మేర‌కు సోమ‌వారం టీఆర్ఎస్ ప్ర‌తినిధి బృందం వికాస్ రాజ్‌కు ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించింది.

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు మాట్లాడుతూ కారును పోలిన గుర్తులను ఇత‌ర అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తుండ‌టంతో త‌మ పార్టీని న‌ష్టం జ‌రుగుతోంద‌ని తెలిపారు. గ‌తంలో ఇలాగే కారును పోలిన గుర్తుల కార‌ణంగా టీఆర్ఎస్‌కు ఓటు వేయాల‌నుకున్న వారు కూడా ఆ గుర్తుల‌కు ఓటేశార‌ని, ఫ‌లితంగా త‌మ పార్టీ ఖాతాలో ప‌డాల్సిన ఓట్లు... కారును పోలిన గుర్తు క‌లిగిన అభ్య‌ర్థుల‌కు వెళ్లిపోయాయ‌ని చెప్పారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి పున‌రావృతం కాకుండా ఉండేలా కారును పోలిస గుర్తును ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను కోరామ‌ని తెలిపారు.
Go Back to Shorts
Telangana
TRS
Car
Free Symbols List
Election Commission
Vikas Raj

More Telugu News