Hyderabad: హైద‌రాబాద్ మెట్రో స‌ర్వీసుల వేళ‌ల పెంపు

metro rail services timings extended
షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌గా పొడిగిస్తూ శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం జ‌రిగింది. ప్ర‌స్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి 11 గంట‌ల‌కు పెంచాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ నిర్ణ‌యించింది. పొడిగించిన కొత్త వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి. 

ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లవుతున్న మెట్రో రైల్ సేవ‌లు రాత్రి 10.15 గంట‌ల దాకా ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా మెట్రో రైల్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యంతో రాత్రి 11 గంట‌ల దాకా మెట్రో సేవ‌లు అందనున్నాయి.
Go Back to Shorts
Hyderabad
Hyderabad Metro
Telangana

More Telugu News