తిరుమల శ్రీవారికి టయోటా కారు బహూకరణ

Toyota car offered to Tirumala Venkateswara Swamy
  • శ్రీవారికి ఖజానాలో మరో వాహన కానుక
  • టయోటా రైడర్ కారును సమర్పించిన హర్ష టయోటా ఎండీ
  • కారు తాళాలను ఈవో ధర్మారెడ్డికి అందించిన వైనం
తిరుమల వెంకన్నకు అందే కానుకలకు అంతే లేదు. నిత్యం ఏదో ఒక రూపంలో స్వామివారి ఖజానా కళకళలాడుతుంటుంది. చాలామంది వాహన రూపేణా కూడా శ్రీవారికి కానుకలు, విరాళాలు అందిస్తుంటారు. 

తాజాగా, హర్ష టయోటా షోరూం ఎండీ ఎం.హర్షవర్ధన్ వెంకటేశ్వరస్వామికి టయోటా రైడర్ కారును విరాళంగా సమర్పించారు. ఇవాళ ఆలయం వద్దకు కారును తీసుకువచ్చిన హర్షవర్ధన్... కారు తాళాలను ఆలయ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కారుకు పూజలు చేసి చక్కగా ముస్తాబు చేశారు. గతంలోనూ హర్ష టయోటా సంస్థ తిరుమల శ్రీవారికి వాహనాన్ని బహూకరించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Toyota Car
Rider
Lord Venkateswara
Harsha Toyota
Tirumala
TTD

More Telugu News