రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్‌: రాంగోపాల్ వ‌ర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్‌: రాంగోపాల్ వ‌ర్మ

rgv tweet on kcr over national politics
  • బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజ‌కీయాల్లోకి టీఆర్ఎస్ వెళుతుంద‌న్న వ‌ర్మ
  • పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా స్టార్లను ప్ర‌స్తావిస్తూ కేసీఆర్‌పై ట్వీట్‌
  • పాన్ ఇండియా సినిమాల అడుగుజాడ‌ల్లోనే టీఆర్ఎస్ ప‌య‌నిస్తోంద‌ని వెల్ల‌డి
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంసిస్తూ సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టారు. అందులో కేసీఆర్‌ను రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ అంటూ ఆయ‌న కితాబునిచ్చారు. తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు సాధించిన సినిమాల‌తో పాటు అందులో లీడ్ రోల్‌లో క‌నిపించిన టాలీవుడ్ హీరోల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ వ‌ర్మ ట్వీట్ పోస్ట్ సాగ‌డం గ‌మ‌నార్హం. 

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, పుష్ప‌, కేజీఎఫ్ 2 అడుగు జాడ‌ల్లో ప‌య‌నిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి బీఆర్ఎస్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని వ‌ర్మ తెలిపారు. రీల్ ఫిల్మ్ స్టార్‌లు అయిన య‌శ్‌, ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్‌గా నిల‌వ‌నున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.
Telangana
TRS
KCR
BRS
Tollywood
RGV

More Telugu News