రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ అందుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బీఐ రికార్డు
- మరింత వృద్ధి సాధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- 5 ట్రిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ
- ఇప్పటికే క్లబ్ లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ
కాగా, ఎస్బీఐ కంటే ముందు రెండు ప్రైవేటు బ్యాంకులు 5 ట్రిలియన్ క్లబ్ లో చేరాయి. హెచ్ డీఎఫ్ సీ మార్కెట్ విలువ 8.42 ట్రిలియన్ కాగా, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ 6.34 ట్రిలియన్లు.
ఇక, భారత్ లో 5 ట్రిలియన్ క్లబ్ లో ఉన్న కంపెనీలన్నింటినీ ఓవరాల్ గా చూస్తే, ఎస్బీఐ ఏడో స్థానంలో నిలుస్తుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (17.72 ట్రిలియన్) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో టీసీఎస్ (11.82), హెచ్ డీఎఫ్ సీ (8.42), ఇన్ఫోసిస్ (6.50), ఐసీఐసీఐ (6.34), హిందూస్థాన్ యూనిలీవర్ (6.08), ఎస్బీఐ (5.03) ఉన్నాయి.