ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్న అమిత్ షా
- ఈ నెల 16న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
- కృష్ణంరాజు కుటుంబసభ్యులతో భేటీ కానున్న కేంద్ర హోం మంత్రి
- 17వ తేదీ ఉదయం తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరు
ఇటీవల మునుగోడు సభ కోసం హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ తో ఆయన భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే, కేవలం ప్రభాస్ ను పరామర్శించడం కోసమే భేటీ అవుతున్నారా? లేక మరే కోణమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.